Elsewhere, Perhaps
చీకటిగా ఉంది. లోపల. పూర్తిగా కాదు. పల్చని వెలుతురు. కాదు , మసక వెలుతురు. దానిని ' వెలుతురు ' అని అనాలంటే , పిలవాలంటే నీకు సంకోచం. దానికి ఒక పేరు పెట్టిన మరుక్షణమే అది తన వెలుతురునీ , తన సారాంశాన్నీ కోల్పోతుందని నీ భయం. వెలుతురు వెలుతురుగా మిగలదని , అది మరేదో అయిపోతుందని నీ ఆందోళన. నీ కన్సర్న్. కానీ తప్పదు. ఈ నామ్నీకరణ. How to escape this naming? This business of naming? This ugly business of framing? Naming as framing ... నీకు నిజంగానే తెలియదు. "చిక్కుబడి పోయారు మీరు , పేర్లలలో. కుదించుకుపోయారు అవి ఏర్పరిచే పరిమితులలో" అని నువ్వు అన్నందుకే , వాళ్లకు చెప్పినందుకే ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావు. ఉన్నావా ? నీకు ఖచ్చితంగా తెలియదు. You doubt it. మరి నీకేం తెలుసు ? పూర్తిగా , ఖచ్చితంగా ? ఖచ్చితంగా కాకపోయినా చూచాయగా ? నీకు తెలిసినదల్లా ఇటువంటి గదులు. ఇటువంటి గోడలు. దుమ్ము పట్టి రంగు మారి వెలసిపోయిన గోడలు. వాటిపై ఎన్నడో ఎవరో చవకైన పెయింట్స్ తో వేసిన బొమ్మలు. పాలిపోయిన నీలం రంగుతో ఆ బొమ్మలు పాక్షికంగా చెరిగిపోయి ... వేసిన చిత్రకారుడి అప్పటి మానసిక స్థితిని - ఉద్వేగంతో వేసి ...